![]() |
![]() |

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావుకు తగ్గ మనవడు అనిపించుకున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. నటనలోనూ, ప్రవర్తనలోనూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు వెళుతున్నారు. ఆయనది కూడా మహానటుడి పేరే. యంగ్ టైగర్‌ను తారక్ అని కొందరు, రామారావు అని ఇంకొందరు జూనియర్ ఎన్టీఆర్ అని మరికొందరు పిలుస్తుంటారు.
అసలు జూనియర్ ఎన్టీఆర్‌కు ముద్దుపేర్లు లేవా? అంటే... 'లేవు' అని చెప్పాలి. తారక్ కూడా 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమంలో ఇదే విషయం చెప్పారు. గేమ్ ఆడటానికి వచ్చిన ఒక కంటెస్టెంట్ టెన్షన్ పడుతుంటే అతడి ముద్దుపేరు గురించి తారక్ డిస్కస్ చేశారు. తర్వాత "మంచి పేరు ఉన్నప్పుడు ఆ పేరు పెట్టి పిలవడం చాలా మంచిది. సో, అందుకనే నన్ను కూడా చిన్నప్పుడు ముద్దుపేర్లు పెట్టి పిలవలేదు" అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు.
అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా క్రోర్‌పతి' ఆధారంగా 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేం షోను రూపకల్పన చేశారు. జెమిని టీవీలో ఈ షో ప్రసారమవుతోంది.
![]() |
![]() |